ECIL Jobs: రాత పరీక్ష లేకుండా ఈసీఐఎల్ లో ఉద్యోగ అవకాశాలు.. పోస్టులు, అర్హత వివరాలివే..!
హైదరాబాద్(HYD)లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(HYD)లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్(Apprenticeship Training) ఇచ్చేందుకు 187 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.ecil.co.in/ ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 1 డిసెంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
- గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ - 150
- డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్ - 37
విద్యార్హత:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
31 డిసెంబర్ 2024 నాటికి 25 ఏళ్లకు మించి ఉండకూడదు.
ఎంపిక ప్రక్రియ:
డిప్లొమా, బీఈ, బీటెక్ పరీక్షల్లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
స్టైఫెండ్:
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,000, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ. 8,000 స్టైఫెండ్ చెల్లిస్తారు.