CSIR- UGC NET Exam: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్‌టీఏ
దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (JRF) అర్హత కోసం నిర్వహించే 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదలైంది.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్(Assistant Professor), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్(JRF) అర్హత కోసం నిర్వహించే 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదలైంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (CSIR), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ పరీక్షను మొత్తం ఐదు సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అర్హత గల విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://csirnet.nta.ac.in/ ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 డిసెంబర్, 2024.
ఎగ్జామ్ డీటెయిల్స్:
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్
విద్యార్హత:
సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ / ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. 55 శాతం మార్కులతో బీఈ/బీఎస్/ బీటెక్/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్ ఉతీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి:
జేఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 01.02.2025 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ. 1150. ఓబీసీ వాళ్లకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 325 ఫీజు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు:
దేశవ్యాప్తంగా 225 నగరాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. సెషన్-1 పరీక్షలు ఉ.9.00 గం.- మ.12.00 గం. వరకు, సెషన్-2 పరీక్షలు మ. 2.00 గం.-సా.5.00 గం. వరకు నిర్వహిస్తారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.