Cochin Shipyard Ltd: కొచ్చిన్ షిప్ యార్డ్ లో సూపర్ వైజరీ పోస్టులు..జీతం ఎంతంటే..?

కేరళ(Kerala)లోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్(Cochin Shipyard Ltd)లో భారీగా సూపర్ వైజరీ(Supervisory) పోస్టుల చేపట్టనున్నారు.

Update: 2024-10-09 17:36 GMT

దిశ, వెబ్‌డెస్క్:కేరళ(Kerala)లోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్(Cochin Shipyard Ltd)లో భారీగా సూపర్ వైజరీ(Supervisory) పోస్టుల చేపట్టనున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ఆన్‌లైన్‌ టెస్ట్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు (https://cochinshipyard.in/) వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు చివరితేది 30 అక్టోబర్ 2024.

పోస్టుల వివరాలు:

  • అసిస్టెంట్ ఇంజినీర్
  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
  • అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్
  • అకౌంటెంట్

ఖాళీల సంఖ్య: 20

విద్యార్హత: పోస్టును బట్టి ఐటిఐ, సీఏ, డిప్లొమా, డిగ్రీ, పీజీ(M.Com) చేసి ఉండాలి

వయోపరిమితి: 45 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, వికలాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ. 55,384

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ టెస్ట్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ: 30-10-2024


Similar News