C-DAC Jobs: బెంగళూరులోని సీడ్యాక్ లో ఉద్యోగ అవకాశాలు.. పోస్టులు,అర్హత, జీతం వివరాలివే..!
మీరు బీటెక్/ఎంటెక్(B.Tech/M.Tech) పాసై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్.
దిశ, వెబ్‌డెస్క్: మీరు బీటెక్/ఎంటెక్(B.Tech/M.Tech) పాసై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్. బెంగళూరు(Bangalore)లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్(C-DAC) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 22 సైంటిస్ట్-బి(Scientist-B) పోస్టులను భర్తీ చేయనున్నారు. డిజైన్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ అండ్ డేటా అనలైటిక్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.cdac.in/index.aspx?id=BL ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 1 డిసెంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
సైంటిస్ట్-బి(Scientist-B) - 22
విద్యార్హత:
పోస్టును బట్టి బీఈ/ బీటెక్/ఎంఈ/ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి:
జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 ఏళ్లు, ఓబీసీలకు 33 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు హైదరాబాద్, ఢిల్లీ, పూణే, బెంగళూరులో జాబ్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 జీతం ఉంటుంది.