JEE- Advanced: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ-అడ్వాన్సుడ్ ఎగ్జామ్ షెడ్యూల్, సిలబస్ విడుదల..!
దేశవ్యాప్తంగా 23 ఐఐటీ(IIT)ల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్(B.tech), బీఆర్క్(B.arch) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ- అడ్వాన్సుడ్(JEE- Advanced) పరీక్షను మే 18న నిర్వహించనున్న విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా 23 ఐఐటీ(IIT)ల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్(B.tech), బీఆర్క్(B.arch) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ- అడ్వాన్సుడ్(JEE- Advanced) పరీక్షను మే 18న నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్(Exam Schedule), సిలబస్(Syllabus)ను ఐఐటీ కాన్పూర్(IIT Kanpur) తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్ https://jeeadv.ac.in/లో పూర్తి వివరాలను పొందుపరిచింది. కాగా ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. సెషన్-1 పరీక్ష మే 18న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెషన్-2 పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనుంది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లను(Hall Tickets) డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ పరీక్షకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23న ప్రారంభమై మే 2 వరకు కొనసాగనుంది. 2024 మార్చి, 2025 మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షల్లో ఉతీర్ణులైన వారు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగా అభ్యర్థులకు రూ.1600, మిగతా విద్యార్థులకు రూ. 3200 ఫీజు ఉంటుంది.