BSF Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో 275 ఉద్యోగాలు.. ఇతర వివరాలివే..!

కేంద్ర హోంశాఖ(Ministry of home)కు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) స్పోర్ట్స్ కోటా(Sports Quota)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Update: 2024-12-01 17:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ(Ministry of home)కు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) స్పోర్ట్స్ కోటా(Sports Quota)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 275 కానిస్టేబుల్(Genreal Duty) గ్రూప్-సీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/ ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 30 డిసెంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

కానిస్టేబుల్(GD) - 275

విద్యార్హత:

పోస్టును బట్టి మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో సంబంధిత క్రీడల్లో పాల్గొని కలిగి ఉండాలి.

వయోపరిమితి:

1 జనవరి 2025 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, మెడికల టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 147.20. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

Tags:    

Similar News