Air India Jobs: ఎయిర్ ఇండియాలో జూనియర్ ఆఫీసర్ జాబ్స్.. అర్హత, జీతం తదితర వివరాలివే..!

టాటా గ్రూప్(Tata Group)కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా(Air India) అనుబంధ సంస్థ ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ASL) వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2024-11-04 17:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్(Tata Group)కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా(Air India) అనుబంధ సంస్థ ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ASL) వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 13 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. విశాఖపట్నం(Visakhapatnam), విజయవాడ(Vijayawada)లోని విమానాశ్రయాలలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.aiasl.in/ ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల(నవంబర్) 11,12 న ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, వియజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

పోస్టు పేరు, ఖాళీలు:

  • జూనియర్ ఆఫీసర్-కస్టమర్ సర్వీస్ - 4
  • ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 1
  • యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ - 8

విద్యార్హత:

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పది/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు.. పని చేసిన అనుభవం ఉండాలి. అలాగే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా ఉండాలి.

వయోపరిమితి:

జూనియర్ ఆఫీసర్-కస్టమర్ సర్వీస్ పోస్టుకు 35 ఏళ్లు, మిగతా పోస్టులకు 28 ఏళ్లకు మించి ఉండకూడదు. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం:

జూనియర్ ఆఫీసర్-కస్టమర్ సర్వీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 29,760, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ. 24,960, యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు రూ. 21,270 వరకు జీతం ఉంటుంది.

Tags:    

Similar News