బంకులో పెట్రోల్‌కు బదులు ‘నీళ్లు’.. వాహనదారుడికి చిర్రెత్తిపోయి..

దిశ, వెబ్‌డెస్క్ : పని మీద బయటకు వెళ్తున్న వాహనదారుడికి ఉదయాన్నే ఆగ్రహం తెప్పించాడు ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తి. దీంతో చెడామడా తిట్టిపోశాడు. ఇంతకు అతను చేసిన పని ఎంటంటే వాహనంలో పెట్రోల్‌కు బదులు నీళ్లు కొట్టడమే. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌లో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. మక్లూర్‌లోని ఓ పెట్రోల్ బంకులో వాహనదారుడు ఉదయాన్నే కారులో ఇంధనం నింపుకుని తన వర్క్ మీద బయలు దేరగా.. మార్గమధ్యలోనే కారు ఆగిపోయింది. […]

Update: 2021-08-01 02:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పని మీద బయటకు వెళ్తున్న వాహనదారుడికి ఉదయాన్నే ఆగ్రహం తెప్పించాడు ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తి. దీంతో చెడామడా తిట్టిపోశాడు. ఇంతకు అతను చేసిన పని ఎంటంటే వాహనంలో పెట్రోల్‌కు బదులు నీళ్లు కొట్టడమే. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌లో ఆదివారం ఉదయం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. మక్లూర్‌లోని ఓ పెట్రోల్ బంకులో వాహనదారుడు ఉదయాన్నే కారులో ఇంధనం నింపుకుని తన వర్క్ మీద బయలు దేరగా.. మార్గమధ్యలోనే కారు ఆగిపోయింది. మెకానిక్‌తో చెక్ చేయించగా ఇంధనం బదులు వాటర్ కొట్టారని చెప్పడంతో వాహనదారుడు బంక్ నిర్వాహకులపై తీవ్రంగా విరుచుకపడ్డాడు. బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు కొడుతున్నారని బాధిత వ్యక్తి ఆరోపించాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News