విమానంలో విరాట్ కోహ్లీ నవ్వులు.. ఆసక్తి రేపుతున్న బీసీసీఐ వీడియో
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాలో వైట్ బాల్ క్రికెట్‌కు నూతన కెప్టెన్ వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మను కెప్టెన్ ఎందుకు చేశారని లేవనెత్తని నెటిజన్లు.. కోహ్లీని ఉన్న ఫలంగా ఎందుకు తీసేశారని సూటిగా ప్రశ్నించారు. దీనిపై కోహ్లీ కూడా తనకు సమాచారం ఇవ్వలేదని చెప్పగా.. వైట్ బాల్ క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లు కరెక్ట్ కాదని ముందుగానే చెప్పినట్టు బీసీసీఐ, సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు. ఇటువంటి పరిణామల నడుమ సౌతాఫ్రికాలో టీమిండియా టూర్ అభిమానుల్లో మరింత […]
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాలో వైట్ బాల్ క్రికెట్‌కు నూతన కెప్టెన్ వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మను కెప్టెన్ ఎందుకు చేశారని లేవనెత్తని నెటిజన్లు.. కోహ్లీని ఉన్న ఫలంగా ఎందుకు తీసేశారని సూటిగా ప్రశ్నించారు. దీనిపై కోహ్లీ కూడా తనకు సమాచారం ఇవ్వలేదని చెప్పగా.. వైట్ బాల్ క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లు కరెక్ట్ కాదని ముందుగానే చెప్పినట్టు బీసీసీఐ, సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు.
ఇటువంటి పరిణామల నడుమ సౌతాఫ్రికాలో టీమిండియా టూర్ అభిమానుల్లో మరింత కలవరం రేపింది. ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చిన కోహ్లీ.. బీసీసీఐకి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం అందరినీ షాక్‌కు గురి చేయగా.. కోహ్లీ వ్యాఖ్యలను బీసీసీఐ కూడా వెంటనే ఖండించడంతో ఈ వివాదం ఎక్కడికిపోతుందో అని అందరూ అనుకున్నారు. కానీ, బీసీసీఐ నేడు అప్‌లోడ్ చేసిన వీడియోలో కోహ్లీ చిరునవ్వుతో కనిపించడంతో అభిమానులు హమ్మయ్యా అనుకుంటున్నారు. పైగా పేసర్ ఇషాంత్ శర్మను ఆటపట్టించడం విశేషం.
From Mumbai to Jo'Burg! 👍 👍
Capturing #TeamIndia's journey to South Africa 🇮🇳 ✈️ 🇿🇦 – By @28anand
Watch the full video 🎥 🔽 #SAvINDhttps://t.co/dJ4eTuyCz5 pic.twitter.com/F0qCR0DvoF
— BCCI (@BCCI) December 17, 2021
వీడియో ఎందుకంటే..
డిసెంబర్ 26న ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమ్ ఇండియా గురువారం దక్షిణాఫ్రికాకు చేరుకున్న సంగతి తెలిసిందే. జట్టు ఆచూకీ గురించి అభిమానులకు అప్‌డేట్ ఇవ్వాలని బీసీసీఐ శుక్రవారం నిర్ణయించింది. ఇందుకోసం ముంబై నుండి జోహన్నెస్‌బర్గ్ వరకు వారు ప్రయాణించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో భారత ఆటగాళ్లు జోవియల్ మూడ్‌లో కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ ఇషాంత్ శర్మను ఆటపట్టించడంతో అంతా సద్దుమణిగిందని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గొడవ అంత సద్దుమణిగినట్టేనా అంటూ రిప్లై ఇస్తూ.. విరాట్ మ్యాచ్‌పై ఫోకస్ చేయాలంటూ కోరుకుంటున్నారు.