భారత్‌తో వాణిజ్యం నెరపలేం: పాక్ పీఎం

ఇస్లామాబాద్: భారత్‌తో వాణిజ్యాన్ని నెరపాలన్న ప్రతిపాదనపై పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. క్యాబినెట్‌ సభ్యులతో భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. భారత్ నుంచి కాటన్, షుగర్ దిగుమతులను ఇప్పుడే పునరుద్ధరించలేమని నిర్ణయం తీసుకున్నారని, ప్రత్యామ్నాయాన్ని కనుగొనాలని సంబంధిత అధికారులకూ పీఎం ఆదేశాలిచ్చినట్టు తెలిపింది. హైపర్ కమిటీ చేసిన ఈ ప్రతిపాదనను ఇమ్రాన్ సారథ్యంలోని క్యాబినెట్ గురువారమే తిరస్కరించిన సంగతి తెలిసిందే. […]

Update: 2021-04-03 05:34 GMT

ఇస్లామాబాద్: భారత్‌తో వాణిజ్యాన్ని నెరపాలన్న ప్రతిపాదనపై పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. క్యాబినెట్‌ సభ్యులతో భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. భారత్ నుంచి కాటన్, షుగర్ దిగుమతులను ఇప్పుడే పునరుద్ధరించలేమని నిర్ణయం తీసుకున్నారని, ప్రత్యామ్నాయాన్ని కనుగొనాలని సంబంధిత అధికారులకూ పీఎం ఆదేశాలిచ్చినట్టు తెలిపింది.

హైపర్ కమిటీ చేసిన ఈ ప్రతిపాదనను ఇమ్రాన్ సారథ్యంలోని క్యాబినెట్ గురువారమే తిరస్కరించిన సంగతి తెలిసిందే. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం తిరిగి కల్పించేవరకు సాధారణ సంబంధాలను పునరుద్ధరించలేమని పేర్కొనడం గమనార్హం.

Tags:    

Similar News