రైతు పొలంలో గంజాయి మొక్కల కలకలం

దిశ, మక్తల్/అమరచింత: మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మండలం చంద్రఘడ్ గ్రామంలో గంజాయి మొక్కలు కలకలం రేపాయి. ఇదే గ్రామానికి చెందిన రైతు రామచంద్రయ్య పొలంలో గంజాయి సాగు చేస్తున్నాడన్న సమాచారం మేరకు డీఎస్పీ కిరణ్ కుమార్, తహసీల్దార్ సింధుజ, ఆత్మకూరు సీఐ రత్నం, ఎక్సైజ్ ఎస్సై వహీద్, అమరచింత ఎస్సై ప్రవీణ్‌లతో కలిసి పొలంలో తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆరు గంజాయి మొక్కలను గుర్తించారు. సదరు రైతును అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై గ్రామస్తులను విచారించగా.. […]

Update: 2021-10-04 06:32 GMT

దిశ, మక్తల్/అమరచింత: మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మండలం చంద్రఘడ్ గ్రామంలో గంజాయి మొక్కలు కలకలం రేపాయి. ఇదే గ్రామానికి చెందిన రైతు రామచంద్రయ్య పొలంలో గంజాయి సాగు చేస్తున్నాడన్న సమాచారం మేరకు డీఎస్పీ కిరణ్ కుమార్, తహసీల్దార్ సింధుజ, ఆత్మకూరు సీఐ రత్నం, ఎక్సైజ్ ఎస్సై వహీద్, అమరచింత ఎస్సై ప్రవీణ్‌లతో కలిసి పొలంలో తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆరు గంజాయి మొక్కలను గుర్తించారు. సదరు రైతును అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై గ్రామస్తులను విచారించగా.. రామచంద్రయ్యకు గంజాయి తాగే అలవాటు ఉందని.. అందుకే మొక్కలను పెంచుతున్నాడని చెప్పుకొచ్చారు. ఎవరో గిట్టని వారు గంజాయి సాగు చేస్తున్నాడని ఫిర్యాదు చేసి ఉంటారన్నారు.

Tags:    

Similar News