స్టాఫ్‌నర్సుల తుది జాబితాపై అభ్యర్థుల ఆందోళన
దిశ,తెలంగాణ బ్యూరో: 2017 స్టాఫ్‌నర్సుల తుది జాబితాలో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు శుక్రవారం టీఎస్ పీఎస్సీ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. టీఎస్ పీఎస్సీ గురువారం వెబ్సైట్లో పెట్టిన లిస్టులో అనర్హుల పేర్లున్నాయని నిరసన వ్యక్తం చేశారు. 2017లో ప్రభుత్వం 3,311 స్టాఫ్‌నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్విడుదల చేసిందని,ఇందులో 3,172 అభ్యర్థుల సర్టిఫికేట్స్వెరిఫికేషన్ మార్చి తొలి వారంలో పూర్తి అయిందన్నారు. అయితే తుది జాబితాలో 2,418 మంది అభ్యర్థుల పేర్లే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తుది […]
దిశ,తెలంగాణ బ్యూరో: 2017 స్టాఫ్‌నర్సుల తుది జాబితాలో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు శుక్రవారం టీఎస్ పీఎస్సీ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. టీఎస్ పీఎస్సీ గురువారం వెబ్సైట్లో పెట్టిన లిస్టులో అనర్హుల పేర్లున్నాయని నిరసన వ్యక్తం చేశారు. 2017లో ప్రభుత్వం 3,311 స్టాఫ్‌నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్విడుదల చేసిందని,ఇందులో 3,172 అభ్యర్థుల సర్టిఫికేట్స్వెరిఫికేషన్ మార్చి తొలి వారంలో పూర్తి అయిందన్నారు. అయితే తుది జాబితాలో 2,418 మంది అభ్యర్థుల పేర్లే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తుది జాబితా పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని,సర్టిఫికేషన్పరిశీలన తర్వాత బీఎస్సీ నర్సింగ్వారికి ఒక్క మార్కు తగ్గించారని అధికారులు చెబుతున్నారని, కానీ దానికి సంబంధించిన వివరాలను వెల్లడించకుండానే తుది జాబితా ప్రకటించారన్నారు. రాష్ట్రంలో కరోన విపత్కర పరిస్థితుల్లో స్టాఫ్‌నర్స్‌ల అవసరమున్నా.. అర్హత లేదనే కారణంతో 893 పోస్టులను భర్తీ చేయకపోవడం బాధాకరమన్నారు.
తొలి విడత పూర్తైన తర్వాత రెండో విడత నియామక ప్రక్రియలోనూ అక్రమాలు జరిగినట్లు అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అభ్యర్థుల ఆందోళనపై టీఎస్పీఎస్సీ అధికారులు స్పందించారు. తాము ప్రకటించిన లిస్టుపై అనుమానాలున్న అభ్యర్థులు తమకు వినతి పత్రం అందించాలని సూచించారు.