70 రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే
సౌత్ సెంట్రల్ రైల్వే భారీగా రైళ్లను రద్దు చేసింది. ముద్కేడ్-పర్బని సెక్షన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో 37 రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. మరో 33 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రటకనలో తెలిపింది. ఈ నెల 8వ తేదిన కొన్ని 9, 10 తేదీల్లో మరికొన్ని రైళ్లు 5 నుంచి 7 రోజుల పాటు రద్దు కానున్నాయి. హైదరాబాద్-ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను 9వ తేదీ నుంచి […]
సౌత్ సెంట్రల్ రైల్వే భారీగా రైళ్లను రద్దు చేసింది. ముద్కేడ్-పర్బని సెక్షన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో 37 రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. మరో 33 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రటకనలో తెలిపింది. ఈ నెల 8వ తేదిన కొన్ని 9, 10 తేదీల్లో మరికొన్ని రైళ్లు 5 నుంచి 7 రోజుల పాటు రద్దు కానున్నాయి. హైదరాబాద్-ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, ఔరంగాబాద్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే వెల్లడించింది. ఆదిలాబాద్-పూర్ణ-ఆదిలాబాద్, ఆదిలాబాద్-పర్లి-ఆదిలాబాద్, నిజామాబాద్-పంధర్‌పూర్-నిజామాబాద్, తిరుపతి-అమరావతి-తిరుపతి, మేడ్చల్-హెచ్‌ఎస్ నాందేడ్-మేడ్చల్ తదితర రైళ్లు రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ఇక్కట్లు పడే అవకాశం ఉంది.