తక్కువ వడ్డీతో కెనరా బ్యాంకు గోల్డ్ లోన్!
దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం వల్ల బంగారు ఆభరణాల తాకట్టు వ్యాపారం పెరుగుతుందని కెనరా బ్యాంకు అంచనా వేస్తోన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బంగారం రుణ విభాగాన్ని, పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద జూన్ 30 వరకూ 7.85 శాతం వార్షిక వడ్డీతో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవచ్చు. ‘వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, వ్యాపారావసరాలు, అరోగ్యానికి, వ్యక్తిగత అవసరాలకు.. ఇలా అన్నిటి కింద రుణాలను పొందవచ్చని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన […]
దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం వల్ల బంగారు ఆభరణాల తాకట్టు వ్యాపారం పెరుగుతుందని కెనరా బ్యాంకు అంచనా వేస్తోన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బంగారం రుణ విభాగాన్ని, పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద జూన్ 30 వరకూ 7.85 శాతం వార్షిక వడ్డీతో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవచ్చు. ‘వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, వ్యాపారావసరాలు, అరోగ్యానికి, వ్యక్తిగత అవసరాలకు.. ఇలా అన్నిటి కింద రుణాలను పొందవచ్చని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన శాఖా కార్యాలయాల్లో ఈ రుణాలను పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు బ్యాంకు స్పష్టం చేసింది. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను ఏడాది నుంచి 3 ఏళ్ల కాల వ్యవధిలోపు చెల్లించే అవకాశాన్ని బ్యాంకు అందిస్తోన్నది. ఖాతాదారుల అత్యవసరాలు తీరేందుకు రుణ మద్దతు అందించేందుకు దీన్ని ప్రారంభించామని కెనరా బ్యాంకు జనరల్ మేనేజర్ విజయ్ కుమారు తెలిపారు.