ఇన్నాళ్లు డేటింగ్.. ఇప్పుడు ఫ్రెండ్‌షిప్.. ఓపెన్ అయిన ఫేమస్ సింగర్స్
దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సెలబ్రిటీ కపుల్ కెనడియన్ సింగర్ షాన్ మెండిస్, క్యూబన్-అమెరికన్ సింగర్ క్యామిలా కాబెల్లో బ్రేకప్ చెప్పేసుకున్నారు. 2019లో డేటింగ్ ప్రారంభించిన ఈ జంట తాజాగా జాయింట్ స్టేట్‌మెంట్ ద్వారా విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ‘హే గాయ్స్.. మా రొమాంటిక్ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ మనుషులుగా ఒకరిపై మరొకరి ప్రేమను అలాగే కొనసాగిస్తాం. మొదట మా ప్రయాణం మంచి స్నేహితులుగానే ప్రారంభమైంది. ఇక ముందు కూడా అలాగే […]
దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సెలబ్రిటీ కపుల్ కెనడియన్ సింగర్ షాన్ మెండిస్, క్యూబన్-అమెరికన్ సింగర్ క్యామిలా కాబెల్లో బ్రేకప్ చెప్పేసుకున్నారు. 2019లో డేటింగ్ ప్రారంభించిన ఈ జంట తాజాగా జాయింట్ స్టేట్‌మెంట్ ద్వారా విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ‘హే గాయ్స్.. మా రొమాంటిక్ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ మనుషులుగా ఒకరిపై మరొకరి ప్రేమను అలాగే కొనసాగిస్తాం. మొదట మా ప్రయాణం మంచి స్నేహితులుగానే ప్రారంభమైంది. ఇక ముందు కూడా అలాగే ఉంటాం. ఇన్నాళ్లు మా ఇద్దరిని ఆదరించినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఫ్యాన్స్.. ‘చాలా హర్ట్ అయ్యాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Camila Cabello and Shawn Mendes have just announced their breakup in statements. 💔 pic.twitter.com/gRyARUOFmv
— Pop Crave (@PopCrave) November 18, 2021