ఎందుకు కాల్ చేస్తున్నారో చెప్పే ట్రూ కాలర్
దిశ, వెబ్‌డెస్క్: ట్రూ కాలర్ యాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొత్త నెంబర్ నుంచి ఎవరైనా కాల్ చేస్తే, ఆ నెంబర్‌తో సేవ్ చేసి ఉన్న పేర్ల డేటా ఆధారంగా.. ఆ నెంబర్ ఎవరిదో చెప్పే ఫీచర్‌తో ప్రారంభమైన ఈ ట్రూ కాలర్ యాప్ అంటే చాలా మందికి ఇష్టం. మొదట్లో కొత్త నెంబర్ వివరాలు చెప్పిన ట్రూ కాలర్.. ఆ తర్వాత కాల్ రావడానికి కొన్ని సెకన్ల ముందే మనకు ఎవరు […]
దిశ, వెబ్‌డెస్క్: ట్రూ కాలర్ యాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొత్త నెంబర్ నుంచి ఎవరైనా కాల్ చేస్తే, ఆ నెంబర్‌తో సేవ్ చేసి ఉన్న పేర్ల డేటా ఆధారంగా.. ఆ నెంబర్ ఎవరిదో చెప్పే ఫీచర్‌తో ప్రారంభమైన ఈ ట్రూ కాలర్ యాప్ అంటే చాలా మందికి ఇష్టం. మొదట్లో కొత్త నెంబర్ వివరాలు చెప్పిన ట్రూ కాలర్.. ఆ తర్వాత కాల్ రావడానికి కొన్ని సెకన్ల ముందే మనకు ఎవరు కాల్ చేయబోతున్నారనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. దానికి మంచి ఆదరణ కూడా లభించింది. అయితే కాల్ ఎవరు చేయబోతున్నారనే కాకుండా ఎందుకు చేయబోతున్నారో కూడా ట్రూ కాలర్ చెప్పగలిగితే బాగుండని అప్పట్లో చాలా మంది ఆశపడ్డారు. ఈ విషయమై ట్రూ కాలర్‌కు మెయిల్స్, మెసేజ్‌లు కూడా పెట్టారు. మరి వినియోగదారులు అడగకుండా కొత్త ఫీచర్‌లు ప్రవేశపెట్టే కంపెనీలు, ఇక వినియోగదారులు అడిగినదాన్ని ఎలా కాదంటాయి?
అందుకే ఇప్పుడు కాల్ రీజన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది ట్రూ కాలర్. ఈ ఫీచర్ ద్వారా ఏదైనా కాల్ వచ్చినపుడు అది ఎవరు చేస్తున్నారనే విషయంతో పాటు, ఎందుకు చేస్తున్నారనే విషయం కూడా తెలుస్తుంది. అలాగే ఎవరికైనా కాల్ చేయాలనుకున్నప్పుడు ఎందుకు చేయాలనుకుంటున్నారనే కారణాన్ని రాసి, కాల్ కలవడానికి ముందు కనిపించేలా చేయవచ్చు. అయితే చాలా మందికి ఫోన్ కాల్స్ మాట్లాడటం పెద్దగా ఇష్టం ఉండదు. వీలైనంత మేరకు మెసేజ్‌లకే ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి వారు కాల్స్ వచ్చినపుడు ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు ఈ ఫీచర్ వల్ల కాల్ ఎందుకు చేస్తున్నారో తెలుస్తుంది కాబట్టి ఆ కాల్ పికప్ చేయాలా? కట్ చేయాలా? అనే విషయాల మీద క్లారిటీ వస్తుంది. ఈ ఫీచర్ గురించి మరింత అర్థమయ్యేలా ట్రూ కాలర్ వారు రెండు వీడియోలను విడుదల చేశారు. ‘వారిస్, కిడ్నాప్’ అనే పేర్లతో ఉన్న ఈ షార్ట్ వీడియో ప్రకటనల్లో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చక్కగా తెలుసుకోవచ్చు.