ఏ ఇబ్బంది ఉన్నా నా నంబర్ 97044 44053 కు ఫోన్ చేయండి : మేయర్
దిశ సిటీబ్యూరో: వర్షాలతో నగరవాసులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా జీహెచ్ఎంసీకి చెందిన నాలుగు హెల్ప్ లైన్ నంబర్లతోపాటు తన నెంబర్ 97044 44053 ఫోన్‌కు కాల్ చేయవచ్చునని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. వర్షాలతో మహా నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాము, మాన్సూన్ బృందాలు, డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్ల ఎత్తిడంతో దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహం పెరిగిందని తెలిపారు. ముందు […]
దిశ సిటీబ్యూరో: వర్షాలతో నగరవాసులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా జీహెచ్ఎంసీకి చెందిన నాలుగు హెల్ప్ లైన్ నంబర్లతోపాటు తన నెంబర్ 97044 44053 ఫోన్‌కు కాల్ చేయవచ్చునని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. వర్షాలతో మహా నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాము, మాన్సూన్ బృందాలు, డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్ల ఎత్తిడంతో దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహం పెరిగిందని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూసీ పరివాహక ప్రాంతం నుండి 50 మందిని ఇల్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు.
తరుచూ కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని మెయిన్ రోడ్, సబ్ రోడ్లలో గుంతలు ఏర్పడిన విషయం వాస్తవమేనని మేయర్ ఒప్పుకున్నారు. వాతావరణం పొడిగా మారిన వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మహా నగర ప్రజలకు వర్షంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా డయల్ 100, కమాండ్ కంట్రోల్ 040-2 1111111 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.