రెమిడిసివిర్ అధిక ధరలకు విక్రయిస్తే ఫోన్ చేయండి

దిశ, ఆందోల్: జిల్లాలో రెమిడిసివిర్ అధిక ధరల అమ్మకాల నియంత్రణకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. బుధవారం అదనపు కలెక్టర్ రాజార్శి షా, డిఎంఅండ్ హెచ్ఓ, రెవిన్యూ డివిజనల్ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్, తదితర అధికారులతో కరోనా బాధితులకు ప్రైవేట్ ఆస్పత్రులలో అందిస్తున్న చికిత్స, వసూలు చేస్తున్న ఫీజు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ల నిల్వలు తదితర అంశాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో రెమిడిసివిర్ నిల్వలు ఉన్నప్పటికీ […]

Update: 2021-05-19 09:17 GMT

దిశ, ఆందోల్: జిల్లాలో రెమిడిసివిర్ అధిక ధరల అమ్మకాల నియంత్రణకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. బుధవారం అదనపు కలెక్టర్ రాజార్శి షా, డిఎంఅండ్ హెచ్ఓ, రెవిన్యూ డివిజనల్ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్, తదితర అధికారులతో కరోనా బాధితులకు ప్రైవేట్ ఆస్పత్రులలో అందిస్తున్న చికిత్స, వసూలు చేస్తున్న ఫీజు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ల నిల్వలు తదితర అంశాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లాల్లో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో రెమిడిసివిర్ నిల్వలు ఉన్నప్పటికీ బాధితులను బయట తీసుకురావాలని పంపిస్తున్నారని, అధిక ధరలను వసూలు చేస్తున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న అన్ని ప్రైవేట్ ఆస్పత్రులను ఆయా నోడల్ అధికారులు వెంటనే ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రైవేట్ ఆస్పత్రులలో కోవిడ్ బాధితులకు అందిస్తున్న చికిత్స వసతులు, రోజువారి ఆయా బెడ్స్ ఛార్జీలు, సిటీ స్కాన్, రెమిడిసివిర్ ఇంజక్షన్ లకు వసూలు చేస్తున్నా, ఫీజుల వివరాలను పేషెంట్స్ అటెండెంట్స్ తో నేరుగా మాట్లాడి తెలుసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. జిల్లా మంత్రి హరీష్ రావు పర్యవేక్షణలో అన్నివిధాల కోవిడ్ బాధితులకు జిల్లా యంత్రాంగం మొత్తం అండగా ఉందన్నారు.

కోవిడ్ బాధితులను రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, చికిత్స, బెడ్స్, ఫీజు తదితర విషయాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అధిక ధరలు, అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లాలో రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్, బెడ్స్, ఇతర మందుల కు ఎలాంటి కొరత లేదన్నారు. కరోనా బాధితులు ఎవ్వరు అధైర్య పడి భయాందోళనలకు గురి కావద్దని, వారికి అన్ని విధాలా భరోసా కల్పించే విధంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ రాజర్షికి సూచించారు.

ప్రైవేట్ ఆస్పత్రులలో ఉన్న రెమిడిసివిర్ ఇంజెక్షన్ల నిల్వల వివరాల నివేదికను రోజువారీగా ఇవ్వాలని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ను ఆదేశించారు. ప్రవైట్ ఆస్పత్రులలో రెమిడిసివిర్ ను అధిక ధరలకు విక్రయించినా, స్టాక్ లేదని తెలిపినా ఇట్టి విషయాన్ని కోవిడ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08455-272233 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. కంట్రోల్ రూమ్ నుండి ఫిర్యాదును
డిఎంఅండ్ హెచ్ ఓ/డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కు కనెక్ట్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రాజార్షి షా,డి ఎం అండ్ హెచ్ ఓ, రెవిన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News