కంపెనీల నియంత్రణకు రెగ్యులేటరీ అవసరం : సీఏఐటీ!
దిశ, వెబ్‌డెస్క్: ఎఫ్‌డీఐ విధానాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ-కామర్స్ సంస్థలపై కఠినమైన చర్యలను తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) ఆదివారం లేఖ రాసింది. భారత్‌లో ఈ-కామర్స్ వ్యాపారాన్ని నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు అధికారం కలిగిన రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరింది. బడా ఈ-కామర్స్ సంస్థలు ప్రభుత్వం విధానాలు, సంబంధిత చట్టాలు, నియమాలను అనుసరించి ఈ-కామర్స్ వ్యాపారం, రిటైల్ వాణిజ్యంపై గుత్తాధిపత్యం చేయడంలో అన్ని రకాల మార్గాలను అనుసరిస్తున్నాయని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఎఫ్‌డీఐ విధానాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ-కామర్స్ సంస్థలపై కఠినమైన చర్యలను తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) ఆదివారం లేఖ రాసింది. భారత్‌లో ఈ-కామర్స్ వ్యాపారాన్ని నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు అధికారం కలిగిన రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరింది. బడా ఈ-కామర్స్ సంస్థలు ప్రభుత్వం విధానాలు, సంబంధిత చట్టాలు, నియమాలను అనుసరించి ఈ-కామర్స్ వ్యాపారం, రిటైల్ వాణిజ్యంపై గుత్తాధిపత్యం చేయడంలో అన్ని రకాల మార్గాలను అనుసరిస్తున్నాయని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) లేఖలో పేర్కొంది.
ఆయా ఈ-కామర్స్ కంపెనీలపై అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలను తీసుకోలేదని సంస్థ తెలిపింది. దానివల్ల చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రధాన అడ్డంకిగా మారిందని సీఏఐటీ పేర్కొంది. ప్రభుత్వ విధానాలను, చట్టాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని వ్యాపారుల సంఘం అభిప్రాయపడింది. ఈ-కామర్స్ వ్యాపార కార్యకలాపాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ చట్టం పరిధిలోకి తెచ్చేందుకు కొన్ని కార్యక్రమాలను చేపట్టినప్పటికీ, కంపెనీలు తప్పించుకుంటున్నాయని సీఏఐటీ పేర్కొంది.