పన్ను రీఫండ్ చేస్తే కేసులు వాపసు : కెయిర్న్ ఎనర్జీ

దిశ, వెబ్‌డెస్క్: రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదానికి సంబంధించి అంతర్జాతీయ ఇంధన సంస్థ కెయిర్న్ ఎనర్జీకి, భారత ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిరింది. పలు దేశాల్లోని భారత ఆస్తులను స్వాధీనం చేసుకునే వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటామని ఆ కంపెనీ మంగళవారం తెలిపింది. 1 బిలియన్ డాలర్ల పన్నును తిరిగి తమకు చెల్లించిన తర్వాత ఈ నిర్ణయం అమలవుతుందని కెయిర్న్ ఎనర్జీ వెల్లడించింది. రెట్రోస్పెక్టిక్ పన్ను వివాదంలో భారత్ చేసిన ప్రతిపానను అంగీకరిస్తున్నామని, 1 బిలియన్ డాలర్ల పన్నులను తమకు చెల్లించిన […]

Update: 2021-09-07 09:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదానికి సంబంధించి అంతర్జాతీయ ఇంధన సంస్థ కెయిర్న్ ఎనర్జీకి, భారత ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిరింది. పలు దేశాల్లోని భారత ఆస్తులను స్వాధీనం చేసుకునే వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటామని ఆ కంపెనీ మంగళవారం తెలిపింది. 1 బిలియన్ డాలర్ల పన్నును తిరిగి తమకు చెల్లించిన తర్వాత ఈ నిర్ణయం అమలవుతుందని కెయిర్న్ ఎనర్జీ వెల్లడించింది. రెట్రోస్పెక్టిక్ పన్ను వివాదంలో భారత్ చేసిన ప్రతిపానను అంగీకరిస్తున్నామని, 1 బిలియన్ డాలర్ల పన్నులను తమకు చెల్లించిన అనంతరమే అంతర్జాతీయ కోర్టులో తాము వేసిన కేసులను ఉపసంహరించుకుంటామని ఆ కంపెనీ సీఈఓ సైమన్ థామ్సన్ ఓ ప్రకటనలో తెలిపారు.

రీఫండ్ ఇచ్చిన తర్వాత అమెరికాలో ఉన్న ఎయిర్ ఇండియా విమానాలతో పాటు ఇతర ఆస్తుల జప్తు కోసం వేసిన కేసులను కెయిర్న్ ఎనర్జీ సంస్థ వెనక్కి తీసుకుంటుంది. రీఫండ్ జరిగిన రోజుల వ్యయధిలో ప్రక్రియ ప్రారంభమవుతుందని సైమన్ వివరించారు. కాగా, పాత తేదీలను లెక్కించి వసూలు చేసే రెట్రోస్పెక్టివ్ పన్ను విధాన చట్టాన్ని ఇటీవల భారత ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, వివాదం పరిష్కరించేందుకు భారత్ ముందడుకు వేసిందని సైమన్ థామ్సన్ అన్నారు. తమ సంస్థకున్న విలువలను కాపాడేందు మేము కట్టుబడి ఉంటాం. ఈ నేపథ్యంలో భారత్ చెల్లించాల్సి ఉన్న పెనాల్టీతో పాటు దానిపై వడ్డీని కెయిర్న్ సంస్థ వదులుకునేందుకు సిద్ధంగా ఉందని సైబన్ తెలిపారు.

Tags:    

Similar News