ఉపాధ్యాయులపై తేల్చలే.. విద్యాశాఖలో స్పష్టత రాని కేడర్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉపాధ్యాయుల కేడర్​ విభజన ఇంకా కొలిక్కి రాలేదు. స్కూల్​ ఎడ్యుకేషన్ ​ఉద్యోగుల విభజనకు సాంకేతికపరమైన అంశాలు అడ్డంకిగా మారుతున్నాయి. అయితే దీనిపై తేల్చకుండానే ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాఠశాల విద్యాశాఖ మినహా ప్రభుత్వ శాఖల్లో జోనల్ ​వారీగా పోస్టుల విభజన పూర్తి అయింది. దీని ప్రకారం బదిలీల ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో పోస్టింగ్​ తీసుకున్న ఉద్యోగులు పలు కారణాలతో […]

Update: 2021-08-09 19:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉపాధ్యాయుల కేడర్​ విభజన ఇంకా కొలిక్కి రాలేదు. స్కూల్​ ఎడ్యుకేషన్ ​ఉద్యోగుల విభజనకు సాంకేతికపరమైన అంశాలు అడ్డంకిగా మారుతున్నాయి. అయితే దీనిపై తేల్చకుండానే ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాఠశాల విద్యాశాఖ మినహా ప్రభుత్వ శాఖల్లో జోనల్ ​వారీగా పోస్టుల విభజన పూర్తి అయింది. దీని ప్రకారం బదిలీల ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో పోస్టింగ్​ తీసుకున్న ఉద్యోగులు పలు కారణాలతో డిప్యూటేషన్లపై పని చేస్తున్నారు. ఇప్పుడు వీళ్లను ఎక్కడకు కేటాయిస్తారో స్పష్టత ఇవ్వాల్సి ఉంటోంది.

పాఠశాల విద్యాశాఖలో కేడర్ ​విభజనపై తెలితేనే బదిలీలు, పదోన్నతులు చేపట్టాల్సి ఉంటోంది. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలో దాదాపు 1.10 లక్షల మంది టీచర్లు ఉన్నారు. వీరిలో దాదాపుగా ఎస్​జీటీలు 55 వేలు, స్కూల్​ అసిస్టెంట్లు 46 వేలు, హెడ్మాస్టర్లు 5 వేల వరకు ఉన్నారు. ఇంకా భాషా పండితులు, పీఈటీలు, ఇటీవల స్కూల్​ ఎడ్యుకేషన్‌లో కేడర్ ​విభజన చేసినా ఎంఈవో స్థాయి కేడర్, నాన్​టీచింగ్ ​స్టాఫ్​కేడర్‌ను వెల్లడించినా టీచర్లపై పెండింగ్ పెట్టారు. అయితే ప్రభుత్వ, లోకల్​ బాడీ టీచర్ల మధ్య సర్వీస్ రూల్స్​ విషయంలో చాలా ఏండ్లుగా వివాదం కొనసాగుతోంది. దీనిపై కోర్టులో కూడా కేసు నడుస్తోంది. హైకోర్టులో కేసును కొట్టివేసినా సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. దీంతో కేడర్ విభజన పెండింగ్ ​పడింది. ఈ వివాదం తేలకుండా ఇప్పుడు కేడర్ విభజన చేసే అవకాశం లేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

సర్దుబాటుకు ఆఫ్షన్లు

ప్రభుత్వ ఉద్యోగుల జోన్ల వారీగా కేడర్ విభజనపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన దరిమిలా సర్దబాటుకు కూడా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా వారం రోజుల వ్యవధిలోనే ఉద్యోగుల నుంచి ఆఫ్షన్లు తీసుకోవాలని యోచిస్తున్నారు. ఆఫ్షన్లను తీసుకున్న తర్వాత ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు స్పౌస్ ​కేసుల్లో ప్రియార్టీ ఇవ్వనున్నారు. స్పౌస్ ​కేసుల్లో బదిలీలు చేపట్టనున్నారు. ఆ తర్వాత ఖాళీలను బట్టి బదిలీల ప్రక్రియ చేయనున్నారు. దీన్ని నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నా కొంత సాంకేతికమైన సమస్యలు ఉండే అవకాశాలున్నాయి. దీంతో కోర్టు కేసులు కూడా వచ్చే చాన్స్ ​ఉందంటున్నారు.

ప్రస్తుతం జోనల్ ​వ్యవస్థ ఖరారు కావడం, కేడర్ ​విభజన కావడంతో వేలాది మంది ఇతర జోన్లలో పని చేస్తున్నారు. ఉదాహరణగా ఉమ్మడి కరీంనగర్ ​జిల్లాలో అపాయింట్​మెంట్​ అయిన ఉద్యోగులు చాలా మంది ఇతర జిల్లాలకు వెళ్లారు. డిప్యూటేషన్లతో కొందరినీ, అనారోగ్య కారణాలతో మరికొందరిని, రాజకీయపరమైన ఒత్తిళ్లు, అవసరాలతో మరికొందరిని ట్రాన్స్​ఫర్​ చేశారు. అయితే వీళ్ల స్థానాలు ఇప్పుడు ఖాళీ చూపించడం లేదు. దీంతో వీరిని తిరిగి యధాస్థానానికి తీసుకువస్తారా.. లేదా బదిలీలతో భర్తీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఆఫ్షన్లు ఇస్తే ఇలాంటి కేసుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా క్లారిటీ రావడం లేదు. ఆయా జిల్లాల్లో ఆఫ్షన్లకు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు నోడల్ ​అధికారులుగా నియమించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్షన్లు ఇచ్చే ఉద్యోగులు ఉమ్మడి జిల్లా కలెక్టర్ల వద్దే ఆఫ్షన్​ పత్రాలు సమర్పించాల్సి ఉంటోంది. వీటన్నింటిపైనా త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయని ఉద్యోగులు భావిస్తున్నారు. కానీ కొంత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉందని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుతున్నారు.

Tags:    

Similar News