నమ్ముకున్న వృత్తే యమపాశమైన వేళ
దిశ, నల్లగొండ: జీవితాన్ని ఇచ్చిన వృత్తే యమపాశమైంది. వృత్తినే నమ్ముకొని బతుకున్న ఆ వ్యక్తి అర్ధాంతరంగా మరణించడంతో అతని కుటుంబం అనాథలా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి తెగిపోయిన కేబుల్ వైర్‌ను మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో కేబుల్ ఆపరేటర్ కిందపడ్డాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలరాజు కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ […]
దిశ, నల్లగొండ: జీవితాన్ని ఇచ్చిన వృత్తే యమపాశమైంది. వృత్తినే నమ్ముకొని బతుకున్న ఆ వ్యక్తి అర్ధాంతరంగా మరణించడంతో అతని కుటుంబం అనాథలా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి తెగిపోయిన కేబుల్ వైర్‌ను మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో కేబుల్ ఆపరేటర్ కిందపడ్డాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలరాజు కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవ్వడంతో కేబుల్ వైర్లు తెగిపోయాయి. దీంతో సోమవారం స్తంభమెక్కి మరమ్మత్తులు చేస్తుండగా.. విద్యుత్ తీగలు తగలడంతో కింద పడ్డాడు. తలకు త్రీవ గాయం కావడంతో బాలరాజు మృతి చెందాడు. బాలరాజుకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.