హుస్సేన్ సాగర్‌లో కేబుల్ కారు
దిశ, వెబ్‌డెస్క్ : త్వరలో హుస్సేన్ సాగర్ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అతి త్వరలో హుస్సేన్ సాగర్‌పై కేబుల్ కారు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ కేబుల్ కారు లుంబినీ పార్క్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు ఆకాశమార్గం వెళ్తుందని, మధ్యలో బుద్ధ విగ్రహాన్ని కేబుల్ కారులో నుంచి తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. దీంతోపాటు కొత్త సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పర్యాటకులను ఆకర్షిస్తాయని తెలిపారు. సినిమా షూటింగ్‌ల కోసం […]
దిశ, వెబ్‌డెస్క్ : త్వరలో హుస్సేన్ సాగర్ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అతి త్వరలో హుస్సేన్ సాగర్‌పై కేబుల్ కారు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ కేబుల్ కారు లుంబినీ పార్క్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు ఆకాశమార్గం వెళ్తుందని, మధ్యలో బుద్ధ విగ్రహాన్ని కేబుల్ కారులో నుంచి తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. దీంతోపాటు కొత్త సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పర్యాటకులను ఆకర్షిస్తాయని తెలిపారు. సినిమా షూటింగ్‌ల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. ప్రపంచస్థాయి లొకేషన్లు తెలంగాణలో ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.