Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్..!
మెటా(Meta)కు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(Whatsapp) తమ యూజర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: మెటా(Meta)కు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(Whatsapp) తమ యూజర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్(Instagram) తరహాలో అనేక సదుపాయాలను తీసుకొస్తోంది. కాగా వాట్సాప్ ఇటీవలే వాయిస్ మెసేజ్ ట్రాన్స్ స్క్రిప్ట్స్(Voice Message 'Transcripts)' పేరుతో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టగా.. త్వరలో మరో కొత్త ఫీచర్(New Feature)ను అందుబాటులోకి తేనుంది. అయితే మనం బిజీ(Busy) ఉన్నప్పుడు వాట్సాప్ లో అన్ని సందేశాల(Messages)ను చూసుకోవడానికి వీలు పడదు. దీంతో కొన్ని మెసేజ్ లను చూడకూండానే వదిలేస్తాం. ఇలాంటి వాటిని గుర్తు చేసేందుకు మెసేజ్ రిమైండర్(Message Reminder) ఫీచర్ ను తీసుకురానుంది. ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ లో చదవకుండా వదిలేసిన సందేశాలను ట్రాక్(Track) చేయచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్(Testing) దశలోనే ఉందని, అందుబాటులోకి రాగానే సెట్టింగ్స్(Settings)లోని నోటిఫికేషన్(Notification)లో ఉన్న రిమైండర్స్ ఆప్షన్ చూజ్ చేసుకొని యాక్టీవేట్ చేసుకోవాలని వాట్సాప్ వెల్లడించింది.