మరో ఐదేళ్లు పాటు పేటీఎం సీఈఓగా విజయ్ శేఖర్
న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా విజయ్ శేఖర్ శర్మను తిరిగి నియమించేందుకు షేర్‌హోల్డర్లు ఆమోదించారు.
న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా విజయ్ శేఖర్ శర్మను తిరిగి నియమించేందుకు షేర్‌హోల్డర్లు ఆమోదించారు. ఈ మేరకు ఆదివారం కంపెనీ వెల్లడించింది. శుక్రవారం జరిగిన సంస్థ 22వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 99.67 శాతం మంది వాటాదారుల ఓట్లు ఆయనకు అనుకూలంగా రావడం గమనార్హం. పేటీఎం సంస్థ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన తర్వాత ఇది మొదటి సమావేశం.
పేటీఎం వరుసగా నష్టాలను ఎదుర్కొంటుండటం, షేర్ విలువ అంతకంతకు క్షీణించడం వంటి పరిణామాల మధ్య విజయ్ శేఖర్ శర్మను సంథ పవది నుంచి పక్కన పెట్టవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, మెజారిటీ సభ్యులు ఆయన్ను కొనసాగించేందుకే సుముఖత వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్ల సలహా సంస్థ ఐఐఏస్ పునఃనియామకానికి వ్యతిరేకంగా సిఫార్సు చేసింది. కంపెనీని లాభదాయకంగా మార్చేందుకు విజయ్ శేఖర్ శర్మ గతంలో పలు కమిట్‌మెంట్లు చేశారని, అయితే అవి అమలు కాలేదని సలహా సంస్థ అభిప్రాయపడింది. కానీ, తాజా సమావేశంలో విజయ్‌కు అనుకూలంగా 99 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి.