వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. యూపీఐ, కార్డు ద్వారా కూడా పేమెంట్స్
యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సప్ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఎప్పుడూ
దిశ, వెబ్‌డెస్క్: యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సప్ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఎప్పుడూ ఏదోక ఫీచర్‌ను ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పటికే కొత్తగా వాట్సప్ ఛానెల్ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సెలబ్రెటీలను ఫాలో అవ్వడంతో పాటు మీడియా సంస్థలకు చెందిన చానెళ్లను ఫాలో అవ్వడం ద్వారా సులువుగా న్యూస్ అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తోన్న వాట్సప్.. మరో ఫీచర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాట్సప్ బిజినెస్ అకౌంట్లలో సులువుగా పేమెంట్ చేసేలా సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇక నుంచి వాట్సప్‌లో యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి బుధవారం వాట్సప్ అధికారిక ప్రకటన చేసింది. వాట్సప్ బిజినెస్ అకౌంట్‌లో ఏదైనా ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు నేరుగా అక్కడే యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు.
ఇంతకుముందు పేమెంట్ చేయాలంటే వేరే వెబ్‌సైట్లు, యూపీఐ పేమెంట్స్ యాప్స్‌లోకి వెళ్లాల్సి ఉండేది. కానీ ఇక నుంచి నేరుగానే వాట్సప్‌లో యూపీఐ యాప్స్, కార్డుల ద్వారా సులువుగా పేమెంట్స్ చేయవచ్చు. షాపింగ్‌ను మరింత సులభతరం చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని వాట్సప్ తెలిపింది. ఇందుకోసం రాజోర్ పే, పేయుతో వాట్సప్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే భారత్‌లో 50 కోట్ల మంది వాట్సప్‌ను వినియోగిస్తున్నారు.