Aadhaar Card సేవల కోసం Toll-Free నంబర్‌ను తీసుకొచ్చిన UIDAI
భారతీయ పౌరులకు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు అయిన ఆధార్ కార్డు గురించి కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని అందించింది.
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ పౌరులకు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు అయిన ఆధార్ కార్డు గురించి కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని అందించింది. ఆధార్ కార్డు గురించిన ఎలాంటి అప్‌డేట్ అయిన, వాటి స్టేటస్‌ల గురించి అయిన తెలుసుకోడానికి UIDAI ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) సాంకేతికత ఆధారిత టోల్-ఫ్రీ నంబర్, AI సపోర్ట్ కలిగిన చాట్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. IVR ఆధారిత టోల్-ఫ్రీ నెంబర్ '1947' ను డయల్ చేయడం ద్వారా PVC కార్డ్ స్టేటస్, ఆధార్ అప్‌డేట్‌లను చెక్ చేసుకోవచ్చు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి AI చాట్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే, మెయిల్ help@uidai.gov.in ద్వారా కూడా ఆధార్ అప్‌డేట్‌లు, ఎన్‌రోల్‌మెంట్, కంప్లైంట్ స్టేటస్‌లు మొదలైన వాటి వివరాల గురించి మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు.
Read Also: ఆధార్‌లో అడ్రస్ అప్‌డేట్ ప్రక్రియను సులభతరం చేసిన యూఐడీఏఐ..!