వినియోగదారులకు షాక్ ఇచ్చిన ట్విట్టర్.. దానికి కూడా డబ్బులు
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉచితంగా అందించిన టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌కు డబ్బులు వసూలు చేయనుంది.
వాషింగ్టన్: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉచితంగా అందించిన టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌కు డబ్బులు వసూలు చేయనుంది. వినియోగదారులకు రెండంచెల భద్రతలో భాగంగా ట్విట్టర్ అకౌంట్‌కు లాగిన్ కావాలంటే పాస్‌వర్డ్‌తో పాటూ ఎస్‌ఎమ్ఎస్, అథెంటికేషన్ యాప్ లేదా సెక్యురిటీ పాస్‌వార్డ్‌ను ఉపయోగించేలా సైబర్ సెక్యూరిటీని ట్విట్టర్ అందించింది.
ఇంతకుముందు వరకు కూడా యూజర్లు సెట్టింగ్ ఆప్షన్‌లోకి వెళ్లి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనెబుల్ చేసి ఉచితంగా ఉపయోగించారు. కానీ ఇక మీదట ఈ సేవలు పొందాలంటే కొంత అమౌంట్ చెల్లించాలని యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అందరికి కాకుండా ట్విటర్ 'బ్లూ టిక్ బాడ్జ్' కలిగి ఉన్నవారికి మాత్రమే అమౌంట్‌ను వసూలు చేయనున్నారు. కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం.." మార్చి 20 తర్వాత, ట్విట్టర్ బ్లూ టిక్ బాడ్జ్ సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే టెక్స్ట్ మెసేజ్‌లను టూ-ఫాక్టర్ అథెంటికేషన్ మెథడ్‌గా ఉపయోగించగలరని" ట్వీట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఒకవేళ బ్లూ టిక్ బాడ్జ్ లేనివారు వాడుతున్నట్లయితే వారు సెట్టింగ్ ఆప్షన్‌లోకి వెళ్లి ఈ ఫీచర్‌ను 30 రోజుల్లోగా డిసేబుల్ చేయాలని, అలాగే అలాంటి వారు వేరే మార్గాన్ని ఎంచుకోవాలని పేర్కొంది. మెసేజ్ ఆధారిత టూ ఫ్యాక్టర్ సెక్యూరిటీ ఫీచర్‌ను ఉచితంగా ఇవ్వడం ద్వారా కంపెనీ ఏడాదికి రూ. 490 కోట్ల వరకు నష్టపోతున్నట్లు అధికారులు తెలిపారు.