Mahila Samman Saving Certificate :మహిళలకు వరం.. ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’
2023లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించబడింది.
దిశ, ఫీచర్స్: 2023లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించబడింది. ఉమెన్ ఇన్వెస్టర్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు డిజైన్ చేయబడింది. మార్చి 31, 2023న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తీసుకురాగా.. ఈ పథకం కింద తెరవబడిన ఖాతా సింగిల్ హోల్డర్ టైప్ ఎకౌంట్‌గా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా ఆథరైజ్డ్ బ్యాంకులో ఈ ఖాతాను తెరవవచ్చు.
ఎవరు తెరవొచ్చు?
2023 గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాను ఒక మహిళ తన కోసం తెరవవచ్చు. లేదా మైనర్ బాలిక తరపున సంరక్షకుడు ఓపెన్ చేయొచ్చు. ఉమెన్ ఇన్వెస్టర్స్ 31 మార్చి, 2025లోపు లేదా అంతకు ముందు ఫారమ్ - I నింపాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్‌పై పరిమితి
పెట్టుబడి పెట్టవలసిన కనీస మొత్తం రూ. 1000 కాగా వంద రూపాయల గుణకాలలో ఏదైనా మొత్తాన్ని ఖాతాలో జమ చేయవచ్చు. అయితే ఆ ఖాతాలో తదుపరి డిపాజిట్ అనుమతించబడదు. పథకం కింద గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 2 లక్షలుగా ఉంది.
వడ్డీ రేటు ఎంత?
ఈ పథకం కింద చేసే డిపాజిట్లపై ఏడాదికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. వడ్డీని త్రైమాసికానికి కలిపి ఖాతాలో జమ చేస్తారు. మార్చి 31, 2023 నాటి ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పథకం నిబంధనలకు అనుగుణంగా లేని అకౌంట్ ఓపెన్ చేసిన లేదా డిపాజిట్ చేసిన ఖాతాదారుకు చెల్లించాల్సిన వడ్డీని, అప్పటికీ వర్తించే రేటుతో కలిపి చెల్లించాలి.
పేమెంట్ ఆఫ్ మెచ్యూరిటీ
డిపాజిట్ చేసిన తేదీ నుంచి రెండేళ్ల తర్వాత డిపాజిట్ మెచ్యూరిటీ అవుతుంది. ఆ టైంలో అకౌంట్ ఆఫీసులో ఫారమ్-2 దరఖాస్తును సమర్పించడం ద్వారా బ్యాలెన్స్‌ని పొందవచ్చు. మెచ్యూరిటీ విలువను నిర్ణయించేటప్పుడు, ఒక్కరూపాయి కూడా నష్టపోకుండా చూస్తారు. ఈ అకౌంట్‌లో భాగంగా 50 పైసలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్క రూపాయికిందే లెక్కిస్తారు. అయితే 50 పైసల కంటే తక్కువ ఉన్న మొత్తాన్ని లెక్కించరు.
విత్ డ్రా చేసుకోవడం ఎలా?
ఖాతా తెరిచిన తేదీ నుంచి మొదటి సంవత్సరం తర్వాత కానీ, ఖాతా మెచ్యూరిటీకి ముందు కానీ, ఖాతాదారుడు ఫారమ్-3 దరఖాస్తును సమర్పించడం ద్వారా బ్యాలెన్స్‌లో గరిష్టంగా 40% విత్‌డ్రా చేసుకోవచ్చు.
అకౌంట్ ఎప్పుడు క్లోజ్ చేయొచ్చు?
అకౌంట్ హోల్డర్ చనిపోయినప్పుడు, లేదా ప్రాణాంతక వ్యాధులు ఉన్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఇందుకోసం అకౌంట్ ఇచ్చిన పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు సదరు ఖాతా సందేహాస్పదమని నిర్ధారించినప్పుడే సాధ్యం. ప్రాసెస్‌లో భాగంగా పూర్తి డాక్యుమెంటేషన్ తర్వాత క్లోజ్ చేయడానికి పర్మిషన్ లభిస్తుంది. అలాగే ఒక ఖాతా అకాలంగా క్లోజ్ చేసినట్లయితే, అసలు మొత్తంపై వడ్డీని ఖాతా నిర్వహించబడిన పథకానికి వర్తించే రేటుతో చెల్లించాలి. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత ఏ సమయంలోనైనా అకౌంట్ ముందస్తుగా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంలో లిస్ట్ చేసినవి కాకుండా, అకౌంట్‌లో ఇంతకు ముందు ఉన్న బ్యాలెన్స్ మాత్రమే వడ్డీకి అర్హత పొందుతుంది. ఈ పథకంలో పేర్కొన్న రేటు కంటే 2% తక్కువగా ఉంది.
ట్రాన్సాక్షన్ చార్జెస్ ఇలా..
రిసీప్ట్ .. ఫిజికల్ మోడ్ రూ. 40
రిసీప్ట్.. ఇ-మోడ్ రూ. 9
చెల్లింపులు రూ.100 టర్నోవర్‌కు 6.5 పైసలు
ఇవి కూడా చదవండి: భారత GDP వృద్ధి అంచనాలు తగ్గించిన ప్రపంచ బ్యాంక్