IndiaAI: క్లౌడ్‌లో కృత్రిమ మేధస్సు కోసం బిడ్‌లను ఆహ్వానించిన ప్రభుత్వం

కృత్రిమ మేధస్సు వినియోగం పెరిగిన నేపథ్యంలో దీనిని మరింత అభివృద్ధి చేయడానికి ఈ ఏడాది మార్చిలో కేంద్ర మంత్రివర్గం రూ.10,372 కోట్లతో ఇండియా AI మిషన్‌ను ఆమోదించింది

Update: 2024-08-17 08:44 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేధస్సు వినియోగం పెరిగిన నేపథ్యంలో దీనిని మరింత అభివృద్ధి చేయడానికి ఈ ఏడాది మార్చిలో కేంద్ర మంత్రివర్గం రూ.10,372 కోట్లతో ఇండియా AI మిషన్‌ను ఆమోదించింది. ఈ నేపథ్యంలో క్లౌడ్‌లో కృత్రిమ మేధస్సు సేవలను అందించడానికి డేటా సెంటర్‌లు, ఎంప్యానెల్డ్ ఏజెన్సీలు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు, స్టార్టప్‌లు, పరిశోధకుల నుంచి బిడ్‌లను ఆహ్వానించింది. దీనిలో గెలుపొందిన వారు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPUలు), యాక్సిలరేటర్‌లు, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్‌లు (TPUలు), స్టోరేజీ మొదలైన హై-స్పీడ్ కంప్యూటింగ్ AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌లో 36 నెలల పాటు నిమగ్నమై ఉంటారు. అవసరం అనుకుంటే ప్రభుత్వం వ్యవధిని మరింత కాలం పొడిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బిడ్‌లకు అర్హత పొందిన ఏజెన్సీలు, ఇండియా ఏఐతో ఒప్పందంపై సంతకం చేసిన తేదీ నుండి 6 నెలలలోపు క్లౌడ్‌లో AI సేవలను అందించడం ద్వారా వారి క్లౌడ్ సర్వీస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా 1,000 AI కంప్యూట్ యూనిట్‌లను అందుబాటులో ఉంచాలి. క్లౌడ్‌లో కృత్రిమ మేధస్సు కోసం తమ వంతుగా కృషి చేయాలనుకునే వారు బిడ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని అర్హులైన వారిని ఎంపిక చేస్తామని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉంది. బిడ్ల సమర్పణకు సెప్టెంబర్ 6 చివరి తేదీగా నిర్ణయించారు.

Tags:    

Similar News