NTPC Green Energy IPO: ముగిసిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీవో బిడ్డింగ్ ప్రక్రియ.. 1.22 రేట్ల సబ్‌స్క్రిప్షన్‌..!

ప్రభుత్వ రంగ కంపెనీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ(NTPC Green Energy) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) బిడ్డింగ్ ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది.

Update: 2024-11-22 10:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ కంపెనీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ(NTPC Green Energy) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) బిడ్డింగ్ ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. కాగా ఈ సంస్థ ఐపీవో ద్వారా సుమారు రూ. 10,000 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వగా మొత్తంగా 1.22 రేట్ల సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. ఎన్ఎస్ఈ(NSE) వెల్లడించిన డేటా ప్రకారం మధ్యాహ్నం వరకు 56 కోట్ల షేర్లకు గాను 68 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల(QIB) నుంచి 1.02 రేట్ల సబ్‌స్క్రిప్షన్లు రాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల(Retail Investors) నుంచి 2.98 రేట్ల సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. ఇక నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(NII)నుంచి 48 శాతం మాత్రమే బిడ్లు ధాఖలయ్యాయి. మరోవైపు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 3,960 కోట్లను సమీకరించినట్లు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఇదివరకే వెల్లడించింది. అయితే ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో కొంత మొత్తాన్ని సంస్థ అభివృద్ధికి, మిగతా నిధులను లోన్స్ కట్టేందుకు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.  

Tags:    

Similar News