Gold Price: పసిడి ప్రియులకు తేరుకోలేని షాక్.. వరసగా ఐదోరోజు భారీగా పెరిగిన బంగారం
గతవారం రూ.3000 మేర ధర తగ్గిన బంగారం.. ఈ వారం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రేటు ఇంకా తగ్గితే కొనాలని ఎదురుచూసిన వారికి షాక్ తగిలినట్లయింది. వరుసగా ఐదోరోజు బంగారం ధర భారీగా పెరిగింది.
దిశ, వెబ్ డెస్క్: వరుసగా ఐదోరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. కొనుగోలు దారులకు ఇది నిజంగా తేరుకోలేని షాకనే చెప్పాలి. గతవారం రూ.3000 మేర ధర తగ్గిన బంగారం.. ఈ వారం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రేటు ఇంకా తగ్గితే కొనాలని ఎదురుచూసిన వారికి షాక్ తగిలినట్లయింది. వరుసగా ఐదోరోజు బంగారం ధర భారీగా పెరిగింది.
శుక్రవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై ధర రూ.800 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.870 పెరిగింది. నేడు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,250కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.78,820కి చేరింది. గడిచిన 5 రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.2900 నుంచి రూ.3,170 వరకూ పెరిగింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. మూడు రోజులుగా ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర రూ.1,01,000గా ఉంది.