SBI Amrit Kalash: ఆ స్కీములో పెట్టుబడికి ముంచుకువస్తోన్న ఆఖరు తేదీ..రాబడిపై కచ్చితమైన హామీ

SBI Amrit Kalash: పొదుపు విషయంలో మనవాళ్లు చాలా ముందుంటారు.

Update: 2025-03-17 04:50 GMT
SBI Amrit Kalash: ఆ స్కీములో పెట్టుబడికి ముంచుకువస్తోన్న ఆఖరు తేదీ..రాబడిపై కచ్చితమైన హామీ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: SBI Amrit Kalash: పొదుపు విషయంలో మనవాళ్లు చాలా ముందుంటారు. భవిష్యత్ ను ఆలోచించి పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఈ మధ్య కాలంలో కొంత తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని ఆకర్షించేందుకు అన్ని బ్యాంకులు కొన్ని ప్రత్యేక పథకాలను ప్రకటిస్తున్నాయి. ఇటీవల ఎస్బిఐ(SBI) ప్రకటించిన ఎస్‌బీఐ అమృత్ కలశ్(SBI Amrit Kalash) పథకం పెట్టుబడికి చివరి తేదీ దగ్గరపడుతోంది.

ఫిక్స్డ్ డిపాజిట్లు(Fixed Deposits) సురక్షితమైన, నమ్మదగిన పెట్టుబడి ఎంపికగా విస్తృతంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ రిస్క్, అధిక రిటర్న్ స్కీములను కోరుకునే సీనియర్ సిటిజన్లు ఇన్వెస్ట్ పై ఆసక్తి చూపుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే అమృత్ ఎఫ్డీ స్కీమ్ నిర్ణీత కాలానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. ఎస్బిఐ అమృత్ కలశ్(SBI Amrit Kalash) స్కీమ్ అనేది మార్చి 31, 2025 వరకు అందుబాటులో ఉండే 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ గా ఉంది.

ఎస్బిఐ అమృత్ కలశ్(SBI Amrit Kalash) పథకం సాధారణ పెట్టుబడిదారులకు ఏడాదికి 7.10శాతం, సీనియర్ సిటిజన్లకు ఏడాదికి 7.60శాతం వడ్డీరేటును అందిస్తుంది. ఈ స్కీమ్ రిటైర్మ్ మెంట్(Scheme Retirement) చేసిన వారికి, స్థిరమైన ఆదాయ మార్గాన్ని కోరుకునే వ్యక్తులకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకంలో రూ. లక్ష పెట్టుబడిపై సాధారణ పెట్టుబడిదారులు 400 రోజుల వ్యవధిలో రూ. 7,100 వడ్డీని అందిస్తుంది. మరోవైపు సీనియర్ సిటిజన్లు రూ. 7,600 వరకు వస్తుంది. రూ. 10 లక్షల పెద్ద పెట్టుబడి సాధారణ పెట్టుబడిదారులకు రూ. 5,916 సీనియర్ సిటిజన్లకు రూ. 6,333 నెలలవారీ వడ్డీ ఆదాయాన్ని ఇస్తుంది.

ఎస్బిఐ అమృత్ కలశ్ స్కీమ్(SBI Amrit Kalash) గడువును అనేక సార్లు పొడిగించింది. ప్రస్తుత గడువు మార్చి 31, 2025గా ఉంది. ఇక పై ఈ పథకంపై ఎలాంటి పొడిగింపు ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ స్కీమ్ సౌకర్యవంతమైన వడ్డీ చెల్లింపు ఎంపికలపై అందిస్తుంది. నెలలవారీ, త్రైమాసిక లేదా అర్ధ వార్షిక లెక్కన వడ్డీ చెల్లిస్తారు. అలాగే రాబడిపై ఆదాయపు పన్ను చట్టం ప్రకారం టీడీఎస్(TDS) తగ్గించిన తర్వాత పెట్టుబడిదారుడి బ్యాంక్ అకౌంట్ కు జమ చేస్తారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు ఎస్బిఐ యోనో బ్యాంకింగ్ యాప్(SBI YONO Banking App) ద్వారా లేదా వారి సమీపంలో ఎస్బిఐ శాఖను సందర్శించడం మార్గాన్ని అందిస్తున్నప్పటికీ పెట్టుబడి పెట్టే ముందు అన్ని స్కీమ్ సంబంధిత పత్రాలను జాగ్రత్తగా సమీక్షించడం అవసరం. ఏదైనా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక సలహాదారుని లేదా సంబంధింత బ్యాంకును సంప్రదించడం చాలా మంచిది. 

Tags:    

Similar News