Today Gold, Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. రెండో రోజు కూడా భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నిన్నటి నుంచి తగ్గి సామాన్య ప్రజలకు కొంత ఊరటనిచ్చాయి. ఈ క్రమంలో తాజాగా రెండో రోజు అనగా నేడు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.400 కు తగ్గి రూ.82,300 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.440 కు తగ్గి రూ.89,780 గా ఉంది. ఇక వెండి ధరలు 2,000 తగ్గి కిలో రూ. 1,10,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.82,300
24 క్యారెట్ల బంగారం ధర - రూ.89,780
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.82,300
24 క్యారెట్ల బంగారం ధర – రూ.89,780