14 హానికరమైన మందులను నిషేధించిన ప్రభుత్వం

ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే 14 రకాల ‘ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్’ మందులను కేంద్ర ప్రభుత్వం తాజాగా నిషేధించింది.

Update: 2023-06-03 07:24 GMT

న్యూఢిల్లీ: ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే 14 రకాల ‘ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్’ మందులను కేంద్ర ప్రభుత్వం తాజాగా నిషేధించింది. గతంలో డీసీజీఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) నిపుణుల కమిటీ ఈ 14 రకాల మందులను పరీక్షించింది. ఇవి ప్రజల ఆరోగ్యానికి హానికరం అని వీటిని నిషేధించాలని పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ డ్రగ్స్ వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని తేలడంతో ప్రభుత్వం ఇప్పుడు ఈ మందులను నిషేధించింది. దీంతో ఈ మందులను ఇకమీదట అమ్మడం గాని, పంపిణీ చేయడం కానీ కుదరదు. ‘ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్’ అనేది ఒకే మాత్రలో ఒకటి కంటే ఎక్కువ మందులను కలిపి తయారు చేసే మందులు. వీటిని 'కాక్‌టెయిల్ డ్రగ్' మందులు అని కూడా అంటారు.

Tags:    

Similar News