అదిరిపోయే ఫీచర్స్‌తో.. ఆల్ట్రోజ్ CNG కారు
టాటా మోటార్స్ అదిరిపోయే అడ్వాన్స్డ్ ఫీచర్స్‌తో టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారును విడుదల చేసింది.
దిశ,వెబ్‌డెస్క్: టాటా మోటార్స్ అదిరిపోయే అడ్వాన్స్డ్ ఫీచర్స్‌తో టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారును విడుదల చేసింది. టాటా మోటార్స్ కస్టమర్స్ ఎప్పటి నుంచో వేచిచూస్తున్న హ్యాచ్ బ్యాక్ సీఎన్జీ కారును కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. CNG విభాగంలో ఇప్పటివరకూ టాటా కంపెనీకి టియాగో, టైగోర్ మోడల్స్ ఉన్నప్పటికి ఇప్పుడు ఆల్ట్రోజ్ ప్లాట్ ఫాంలో కూడా CNG ఆప్షన్ అందించింది.
ధర ఎంతంటే: టాటా ఆల్ట్రోజ్ CNG కారు బేసిక్ వేరియంట్ దేశవ్యాప్తంగా ఎక్స్ షోరూం ధర 7.55 లక్షలు కాగా ఆ కారు వేరియంట్‌ని బట్టి రూ. 10.55 లక్షల వరకు ఉంది. టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు బుకింగ్ చేసుకోవాలనుకునే వారు రూ. 21 వేలు టోకెన్ ఎమౌంట్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు మొత్తం 6 వేరియంట్స్‌లో లాంచ్ అయింది. XE CNG, XM+ CNG, XM+ (S) CNG, XZ CNG, XZ+ (S) CNG, XZ+O (S) CNG వేరియంట్స్‌లో కార్లు లాంచ్ అయ్యాయి.
కొత్త ఫీచర్లు ఇవే: ట్విన్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీతో పాటు వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్: కలర్ వేరియంట్స్ విషయానికొస్తే ఆర్కేడ్ గ్రే, హై స్ట్రీట్ గోల్డ్, ఒపెరా బ్లూ, డౌన్‌టౌన్ రెడ్, అవెన్యూ వైట్, హార్బర్ బ్లూ, కాస్మో డార్క్ కలర్ వేరియంట్స్‌లో ఈ కారు లభిస్తోంది.
సేఫ్టీ ఫీచర్స్: డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, కార్నర్ స్టెబిలిటి కంట్రోల్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ టెదర్ యాంకరేజ్, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి.
Also Read...