ఈవీల కోసమే ప్రత్యేక షోరూమ్‌లు ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్!
శీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కేవలం ఈవీల కోసం ప్రత్యేక షొరూమ్‌లను ప్రారంభించాలని భావిస్తోంది..
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కేవలం ఈవీల కోసం ప్రత్యేక షొరూమ్‌లను ప్రారంభించాలని భావిస్తోంది. దానికోసం టాటా ఈవీ అనుబంధ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోపు ఈవీ ప్రత్యేక షోరూమ్ డిజైన్, ఔట్‌లెట్ల సంఖ్యకు సంబంధించిన ప్రణాళికను కలిగి ఉండాలని నిర్ణయించింది. రాబోయే ఆరు నుంచి 12 నెలల్లో ఈవీ షోరూమ్‌లను అందుబాటులోకి తీసుకురావాలనే కంపెనీ లక్ష్యంగా ఉంది. మొదటి రెండు షోరూమ్‌లు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రారంభించనుండగా, అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించనుంది.
అన్ని అనుకున్నట్టు జరిగితే దేశంలో ఈవీల కోసం ప్రత్యేక షోరూమ్‌లను ప్రారంభించిన సాంప్రదాయ కార్ల తయారీ సంస్థగా టాటా మోటార్స్ నిలుస్తుంది. దేశంలో పెరుగుతున్న ఈవీ వినియోగదారుల ఆధారంగా ఈ షోరూమ్‌ల ఏర్పాటు వేగవంతం అవుతుంది. 2022లో దేశంలో ఈవీల అమ్మకాలు మూడు రెట్లు పెరగడం వల్లనే టాటా మోటార్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పలు నివేదికలు అభిప్రాయపడ్డాయి. తొలి దశలో కంపెనీ ప్రధాన పది టైర్2 నగరాల్లో 10 స్టోర్లను ఏర్పాటు చేయనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Also Read..