Swiggy IPO: స్విగ్గీ ఐపీఓ.. రెండు రోజు కూడా సేమ్ సీన్

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) ఐపీఓ(IPO)కు రెండో రోజు కూడా ఇన్వెస్టర్ల(Investors) నుంచి నామమాత్రమైన బిడ్లు దాఖలయ్యాయి.

Update: 2024-11-07 14:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) ఐపీఓ(IPO)కు రెండో రోజు కూడా ఇన్వెస్టర్ల(Investors) నుంచి నామమాత్రమైన బిడ్లు దాఖలయ్యాయి. గురువారం నాటికి 35 శాతం షేర్లు మాత్రమే సబ్‌స్క్రిప్షన్‌ అయ్యాయి. మొత్తం 16 కోట్ల షేర్లకు గాను రెండు రోజులకు కలిపి 5.56 కోట్ల షేర్లకు మాత్రమే సబ్‌స్క్రిప్షన్‌ చేసుకున్నారు. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్ల(Retail Investors) నుంచి 84 శాతం సబ్ స్క్రిప్షన్ లభించగా, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు(Non Institutional Investors) 14 శాతం మంది మాత్రమే బిడ్లు ఫైల్ చేశారు. కాగా స్విగ్గీ సంస్థ ఐపీఓ ద్వారా సుమారు రూ. 11,300 కోట్లను సమీకరించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా రూ.6,800 కోట్లు, తాజా షేర్ల విక్రయం ద్వారా రూ.4,500 కోట్ల నిధులను సేకరించనుంది. ఇక ఒక్కో ఈక్విటీ షేర్ ధరను రూ. 371- రూ. 390గా కంపెనీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే స్విగ్గీ ఐపీఓ బిడ్డింగ్ ప్రక్రియ(Bidding Process)కు ఇంకో రోజు మాత్రమే మిగిలి ఉంది.

Tags:    

Similar News