Swiggy IPO: స్విగ్గీ ఐపీఓ.. తొలి రోజు రెస్పాన్స్ అంతంత మాత్రమే

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) సబ్‌స్క్రిప్షన్‌ ఈ రోజు ప్రారంభమైంది.

Update: 2024-11-06 15:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) సబ్‌స్క్రిప్షన్‌ ఈ రోజు ప్రారంభమైంది. అయితే చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన స్విగ్గీ ఐపీఓకు ఇన్వెస్టర్లు నుంచి స్పందన అంతంత మాత్రమే వచ్చింది. తొలిరోజు కేవలం 12 శాతం మంది మాత్రమే స్విగ్గీ ఐపీఓను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. 16 కోట్ల షేర్లలో కేవలం 1.89 లక్షల షేర్లుకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్ల(Retail Investors) సబ్‌స్క్రిప్షన్‌ కోటా 54 శాతం ఉండగా.. నాన్ ఇన్ స్టిట్యూషనల్(Non-institutional) ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్‌ కోటా 6 శాతంగా ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు(Anchor Investors) నుంచి రూ. 5085 కోట్లను సమీకరించామని, బిడ్డింగ్ ప్రక్రియ(Bidding Process) నవంబర్8 వరకు కొనసాగనుందని స్విగ్గీ తెలిపింది.

కాగా ఐపీఓ షేర్ల ద్వారా సుమారు రూ. 11,300 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో ఆ సంస్థ ఐపీఓలోకి వచ్చింది. ఇందులో షేర్ల విక్రయం ద్వారా రూ. 4500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 6800 కోట్లను సమీకరించనున్నారు. ఇక ఒక్కో ఈక్విటీ షేర్ ధరను రూ. 371-390గా కంపెనీ ఖరారు చేసింది. కాగా ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను బ్రాండ్ మార్కెటింగ్, టెక్నాలజీ, లోన్స్ పే చేయడానికి, కార్పొరేట్ అవసరాలకు యూజ్ చేసుకుంటామని స్విగ్గీ వెల్లడించింది.

Tags:    

Similar News