లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. గతవారాంతం సెషన్‌లో పుంజుకున్న సూచీలు సోమవారం ట్రేడింగ్‌లోనూ అదే జోరును కొనసాగించాయి.
ముంబై: దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. గతవారాంతం సెషన్‌లో పుంజుకున్న సూచీలు సోమవారం ట్రేడింగ్‌లోనూ అదే జోరును కొనసాగించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్లు, ఫిబ్రవరి నెలకు సంబంధించి వాహన పరిశ్రమలో రిటైల్ అమ్మకాలు గణనీయంగా పెరగడం వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. మరోవైపు అదానీ గ్రూప్ కంపెనీల్లో బ్లాక్ డీల్స్ కారణంగా షేర్లలో లాభాలు కొనసాగాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 415.49 పాయింట్లు లాభపడి 60,224 వద్ద, నిఫ్టీ 117.10 పాయింట్లు పెరిగి 17,711 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాలు నీరసించగా, ఐటీ, ఆటో, ఫైనాన్స్ రంగాలు బలపడ్డాయి.
సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలు సాధించాయి. టాటా స్టీల్, ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 81.93 వద్ద ఉంది.