లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు నమోదయ్యాయి. గతవారం నుంచి తీవ్ర ఒత్తిడిలో ఉన్న సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో మెరుగైన లాభాలను చూశాయి.

Update: 2023-03-29 11:29 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు నమోదయ్యాయి. గతవారం నుంచి తీవ్ర ఒత్తిడిలో ఉన్న సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో మెరుగైన లాభాలను చూశాయి. బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు నెమ్మదించడంతో గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభమైన తర్వాత మిడ్-సెషన్ వరకు స్థిరంగా కదలాడిన సూచీలు ఆ తర్వాత కొంత నెమ్మదించాయి. అయితే, చివరి గంటలో కీలక రంగాల్లో కొనుగోళ్ల జోరు పెరగడంతో లాభాలు పెరిగాయి. మార్చి నెలకు సంబంధించి ఎఫ్అండ్ఓ గడువు ముగిసే రోజు అయినప్పటికీ ఆఖర్లో కీలక కంపెనీల షేర్లలో ర్యాలీ కనిపించింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 346.37 పాయింట్లు ఎగసి 57,960 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 17,080 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, మీడియా, మెటల్, రియల్టీ రంగాలు 2 శాతానికి పైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రా సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందూస్తాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ షేర్లు అధిక లాభాలను సాధించాయి.

భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, ఏషియన్ పెయింట్, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.30 వద్ద ఉంది.

Tags:    

Similar News