Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.

Update: 2024-11-11 11:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడం, విదేశీ మదుపర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లేకపోవడంతో సోమవారం సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ముఖ్యంగా ఈ రోజు ఐటీ స్టాక్స్(IT Stocks), బ్యాంక్ స్టాక్స్(Bank Stocks) రాణించాయి. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 79,298.46 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,102.14 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌ చివరికి 9.83 పాయింట్ల లాభంతో 79,496.15 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 6 పాయింట్లు తగ్గి 24,141 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.39 దగ్గర ముగిసింది.

లాభాలో ముగిసిన షేర్లు : హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్

నష్టపోయిన షేర్లు : ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా 

Tags:    

Similar News