stock Market: ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ మార్కెట్ సూచీలు(Domestic Market Indices) శుక్రవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి.

Update: 2024-10-11 06:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్ సూచీలు(Domestic Market Indices) శుక్రవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ మార్కెట్ సూచీలు అప్రమత్తత పాటిస్తున్నాయి. ఉదయం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ(BSE) సూచీ సెన్సెక్స్‌(Sensex) 81 పాయింట్ల నష్టంతో 81,432 వద్ద కొనసాగుతుండగా, జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి(NSE) సూచీ నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు లాభపడి 24,976 వద్ద ట్రేడవుతోంది. అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రెండు పైసలు పెరిగి రూ.83.96గా కొనసాగుతోంది. భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, టాటా స్టీల్, రిలయన్స్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.


Similar News