Jio Finance: జియో ఫైనాన్స్ యాప్‌ను లాంచ్ చేసిన రిలయన్స్..కేవలం ఐదు నిమిషాల్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్

భారతదేశంలోనే అతిపెద్ద సంస్థ, ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ కంపెనీ(Reliance Company) ఫైనాన్స్ రంగం(Finance Sector)లోకి అడుగుపెట్టింది.

Update: 2024-10-11 08:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలోనే అతిపెద్ద సంస్థ, ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ కంపెనీ(Reliance Company) ఫైనాన్స్ రంగం(Finance Sector)లోకి అడుగుపెట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక సేవల విభాగం 'జియో ఫైనాన్స్(Jio Finance)' పేరిట కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. కాగా ఈ ఏడాది మే 30నే ఫైనాన్స్ యాప్‌ను ప్రవేశపెట్టగా, యూజర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని పూర్తిస్థాయిలో ఇప్పుడు ప్రారంభించారు. ఈ విషయాన్ని కంపెనీ తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్(Stock Exchange Filing)లో తెలిపింది. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్‌లో దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, మై జియో(My Jio)లో ఈ యాప్ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.

ఐదు నిమిషాల్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్..

ఈ యాప్‌లో కేవలం 5 నిమిషాల్లో సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చని, బయోమెట్రిక్, ఫిజికల్ డెబిట్ కార్డుతో ఎలాంటి సమస్యలు లేకుండా బ్యాంకు ఖాతాను పొందవచ్చని సంస్థ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ యాప్‌తో డిజిటల్ బ్యాంకింగ్, బిల్లుల చెల్లింపు, యూపీఐ లావాదేవీలు వంటి సేవలు పొందవచ్చని తెలిపింది.

జీరో ప్లాట్‌ఫామ్‌ ఫీ..

కాగా ఫోన్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ యాప్‌ లు మొబైల్ రీఛార్జీలపై ప్లాట్‌ఫామ్‌ ఫీజు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ జియో ఫైనాన్స్ యాప్ ద్వారా చేసే రీఛార్జీలపై జీరో ప్లాట్‌ఫామ్‌ ఫీ ఉంటుంది. అలాగే యూపీఐ లావాదేవీలపై ప్రత్యేకమైన రివార్డు పాయింట్లు ఇవ్వనుంది. ఇక ఈ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్లపై లోన్ తీసుకోవచ్చు.చాట్ చేసి ఈజీగా రుణం పొందొచ్చు. ఈ యాప్ లో ఉన్న మరో స్పెషల్ ఫెసిలిటీ ఏంటంటే జియో సిమ్ యూజర్లే కాకుండా ఇతర సిమ్ కార్డు వాడే వారు కూడా ఈ యాప్ ద్వారా సేవలు పొందవచ్చు.


Similar News