Sridhar Vembu: ప్రాఫిటబుల్ కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటిస్తే ఉద్యోగులు నమ్మేదెలా.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు
ప్రపంచ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్(layoffs) ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్(layoffs) ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి(Corona Epidemic) వల్ల సంస్థలు ఆర్థికంగా నష్టపోవడం, ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్(AI) సేవలు అందుబాటులోకి రావడం లాంటి తదితర కారణాలతో కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ, జోహో ఫౌండర్(Zoho Founder) శ్రీధర్ వెంబు(Sridhar Vembu) లేఆఫ్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. లాభాలను ఆర్జిస్తున్న కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటిస్తే ఆ సంస్థను ఉద్యోగులు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు.
'ఆ కంపెనీ వద్ద 100 కోట్ల క్యాష్ ఉంది. వార్షిక ఆదాయం కన్నా ఇది 1.5 రెట్లు ఎక్కువ. 20% గ్రోత్‌రేటుతో ఆ కంపెనీ లాభాల్ని ఆర్జిస్తోంది. అలాగే మూడో త్రైమాసికంలో 18 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో పాటు 40 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసే ప్రణాళికలు ఆ సంస్థకు ఉన్నాయి. అయినా కూడా 12 నుంచి 13 శాతం ఉద్యోగుల్ని తొలగించి వారి విశ్వాసాన్ని ఆశించడం దురాశే’ అని ఆయన ఎక్స్(X)లో పోస్ట్ చేశారు. అయితే చెన్నై(Chennai) కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రెష్‌వర్క్స్(Freshworks) కంపెనీని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఆ సంస్థ రీసెంటుగా 660 మంది సిబ్బందిపై వేటు వేసింది. కాగా ఆయన చేసిన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
A company that has $1 billion cash, which is about 1.5 times its annual revenue, and is actually still growing at a decent 20% rate and making a cash profit, laying off 12-13% of its workforce should not expect any loyalty from its employees ever. And to add insult to injury,…
— Sridhar Vembu (@svembu) November 7, 2024