Satellite Internet: షరతులకు లోబడే ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌కు లైసెన్స్: జ్యోతిరాదిత్య సింధియా

భద్రతకు సంబంధించి అన్నిటినీ పూర్తి చేసిన తర్వాత మాత్రమే దేశంలో కార్యకలాపాలకు అనుమతులుంటాయని మంగళవారం ప్రకటనలో తెలిపారు.

Update: 2024-11-12 18:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ సంపన్నుడు ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు దేశీయంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించి అన్ని షరతులకు లోబడి ఉంటేనే లైసెన్స్ ఇవ్వనున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భద్రతకు సంబంధించి అన్నిటినీ పూర్తి చేసిన తర్వాత మాత్రమే దేశంలో కార్యకలాపాలకు అనుమతులుంటాయని మంగళవారం ప్రకటనలో తెలిపారు. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భద్రతా కోణం నుంచే చూడాలని, అన్ని సమస్యలకు పరిష్కారమయ్యాయని నిర్ధారించుకోవాలి. అప్పుడే ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు. స్టార్‌లింక్ లాంటి శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సంస్థలకు ప్రోత్సాహకరంగా ఉండటానికి అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయకుండా పరిపాలనాపరంగా కేటాయించడం జరుగుతుందని సింధియా ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎలోన్ మస్క్ స్టార్‌లింక్‌ ద్వారా భారత టెలికాం రంగంలోకి ప్రవేశించాలని చూస్తున్నారు. దీంతో త్వరలో స్టార్‌లింక్, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో, భారతీ ఎయిర్‌టెల్ మధ్య శాటిలైట్ ఇంటర్నెట్ విభాగంలో తీవ్ర పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. 

Tags:    

Similar News