Onion Price: ఉల్లి ధరల కట్టడికి బఫర్ స్టాక్ విడుదల చేయనున్న కేంద్రం

తాత్కాలిక రేట్లను నియంత్రించేందుకు బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది

Update: 2024-11-12 17:30 GMT
Onion Price: ఉల్లి ధరల కట్టడికి బఫర్ స్టాక్ విడుదల చేయనున్న కేంద్రం
  • whatsapp icon

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇటీవలే ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి ఉల్లి ధరలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ధరలను కట్టడి చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఉల్లి ధరలను నిశితంగా పరిశీలిస్తున్నామని, తాత్కాలిక రేట్లను నియంత్రించేందుకు బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం మంగళవారం ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశ రాజధానిలో ఉల్లి రిటైల్ ధర కిలో రూ. 67 ఉండగా, దేశవ్యాప్తంగా సగటున రూ. 60 ఉంది. పండుగ సీజన్, మండీల మూసివేత కారణంగా గత 2-3 రోజుల్లో ఉల్లి సరఫరాను పెంచామని ప్రభుత్వం పేర్కొంది. రైలు, రోడ్డు రవాణా ద్వారా ఎన్‌సీసీఎఫ్ నుంచి మరింత ఉల్లిని సరఫరా చేసి లభ్యతను పెంచుతామని వెల్లడించింది. ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది 4.7 లక్షల టన్నుల రబీ ఉల్లిని సేకరించింది. వీటిని సెప్టంబర్ మొదటి వారం నుంచే కిలో రూ. 35 చొప్పున దేశవ్యాప్తంగా ప్రధాన మండీలలో విక్రయాలకు ఉంచింది. 

Tags:    

Similar News