లాభాల నుంచి నష్టాలకు మారిన సూచీలు!

దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిశాయి

Update: 2023-05-09 10:58 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిశాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచి లాభాల్లో కదలాడిన సూచీలు చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా బలహీనపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, బెంచ్‌మార్క్ సూచీలు గరిష్టాల వద్ద ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు సిద్ధపడ్డారు. వీటికి తోడు దిగ్గజ సంస్థల షేర్లు నీరసించడం, కీలక రంగాలైన పీఎస్‌యూ బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్‌లలో ఇన్వెస్టర్లు ఎక్కువగా షేర్లను విక్రయించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 2.92 పాయింట్లు తగ్గి 61,761 వద్ద, నిఫ్టీ 1.55 పాయింట్లు లాభపడి 18,265 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఫార్మా, ఆటో రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఐటీసీ, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.05 వద్ద ఉంది.

Tags:    

Similar News