మహిళలకు ప్రత్యేకంగా అధిక వడ్డీని అందించే పొదుపు పథకాలు!
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు
దిశ, వెబ్‌డెస్క్: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. పురుషులతో పాటు సమానంగా మహిళలకు అన్ని అవకాశాలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాల్లో పెట్టుబడులపై మహిళలకు ప్రత్యేకంగా అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి మొదలుకుని వివిధ ప్రైవేటు సంస్థలు సైతం వారికోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు, RDలలో ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఏ ఏ పథకాల్లో మహిళలకు ఎక్కువ వడ్డీ లభిస్తుందో ఒకసారి చూద్దాం..
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: ఈ బ్యాంకు గృహ లక్ష్మి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అనే కొత్త FD పథకాన్ని తీసుకొచ్చింది. దీని మెచ్యూరిటీ వ్యవధి 551 రోజులు. ఇందులో రెండు రకాల పెట్టుబడులు ఉన్నాయి. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్. 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళలకు ఆఫ్‌లైన్ పెట్టుబడికి 6.65 శాతం వడ్డీ రేటు, అదే ఆన్‌లైన్ అయితే 6.90 శాతం వడ్డీ రేటు ఉంటుంది. సీనియర్ సిటిజన్ మహిళలు ఆఫ్‌లైన్ పెట్టుబడికి 7.15 శాతం, ఆన్‌లైన్ పెట్టుబడికి 7.40% వడ్డీ రేటును పొందవచ్చు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్: మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన చిన్న పొదుపు పథకం. దీనిలో రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ రేటు 7.50 శాతం. ఏ వయస్సు మహిళలు అయిన దీనిలో చేరవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం దగ్గరలోని పోస్టాఫీసులో సంప్రదించగలరు.
ఇండియన్ బ్యాంక్: 400 రోజుల పాటు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 60 ఏళ్లలోపు మహిళలకు 7.15 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్ మహిళలకు 7.60 శాతం, సూపర్ సిటిజన్ మహిళలకు 7.90 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
Also Read..