Bank Loan: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా .. అయిన బ్యాంకులో లోన్ పొందొచ్చని తెలుసా?
చాలా మంది డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.
దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. సకాలంలో చెల్లింపులు కట్టలేక బ్యాంక్ లోన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే.. లోన్ త్వరగా వచ్చేస్తుంది. తక్కువగా ఉన్నప్పుడు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం చాలా కష్టమవుతుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారు సులభంగా బ్యాంక్ లో లోన్ ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం..
బ్యాంకులు రుణం ఇచ్చే ముందు సెక్యూరిటీని చూసి ఇస్తుంది. మీ ఆస్తిని, గోల్డ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) లాంటి వస్తువులను గ్యారెంటీగా ఉంచితే త్వరగా లోన్ ను మంజూరు చేస్తాయి. ఈ పద్ధతిలో బ్యాంకులు మీ సిబిల్ స్కోర్‌ను పట్టించుకోకుండా ఇచ్చేస్తుంది.
మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి సహకారంతో బ్యాంక్ లో ఋణం పొందొచ్చు. ఆ వ్యక్తుల సహకారంతో లోన్ తీసుకోవచ్చు. ఇక్కడ సిబిల్ స్కోర్ తో అవసరం ఉండదు. దీనిని “కోసైన్” లేదా “కాపర్” అని పిలుస్తారు. మీకు బాగా నమ్మదగిన వ్యక్తిని గ్యారెంటీగా ఉంచితే, బ్యాంకులు త్వరగా లోన్ ఇస్తాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.